Thursday, 14 May 2015

ఆరోగ్యం

శ్లో" అగస్త్యం కుంభకర్ణంచ శ మంచ బడబానలమ్"
     ఆహారపరిణామార్దం స్మరామిచ వృకోదరమ్"

ఈ శ్లోకమును బోజనము చేయగానే ధ్యానించిన వారికి ఆహారపదార్దములు చక్కగా జీర్ణమై 
శరీరారోగ్యమై కలిగించును.    

కార్య జయం

శ్లో" యశ్శివొ నామరూపాభ్యాం యాదేవిసర్వమంగాలా 
     తయోస్సంస్మరణాత్పుoసాం సర్వాత జయమంగళం 
     లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాంపరాభవ
     యేషామిందీవరశ్యామోహృదయస్తోజనార్దన:

ఈ శ్లోకమును ఇంటినుండి కార్యార్దముగా వెళ్ళునప్పుడు ధ్యానించిన యెడల 
ఆ కార్యము నిర్విగ్నముగా నెరవేరుటయే  గాక ధనలాభము కలిగించును. 

ఐస్వర్యప్రప్తికి

మూలమంత్రం;-  "ఓం హౌం నమశ్శివాయ" 

భార్య భర్తల మధ్య విరోధము తొలగిపోవుటకు

మూలమంత్రము:-" ఓం నమో మహాయక్షిణ్యె మమ పతిం (ఆముకం ) మే వశ్యం కురు కురు స్వాహా "

భార్య భర్తల మధ్య విరోధము వచ్చి భార్య పుటింటికి వెళ్లి వుండిపోయిన రోజులలో రాత్రిపూట ఆవు నేతితో దీపం
వెలిగించి ఆ దీపం వద్ద స్త్రీ కుర్చుని పైన వ్రాసిన మంత్రమును 108 సార్లు చొప్పున 11 రాత్రులు జపం చేస్తే ఆమె భర్త
తనంత తానుగా వచ్చి తన భార్యను ప్రేమగా తీసుకువేల్లిపోవును. సుకంగా కలతలు లేకుండా కాపురము చేయుదురు. ఈ రహస్యం భర్తకు తెలియనియకూడదు.   

వివాహం కొరకు

దుర్గ దేవి ఆలయమందు కానీ దేవత పటము నందు కానీ కుర్చుని ఆ దేవతను పూజించి ప్రతి రోజు పాత్రకలమందు
నాకు వివాహం కావాలి అని తలుచుకొని రోజు 11 సార్లు చొప్పున తులసి కవచమును 40 రోజులు పారాయణం చేయటం వలన ఏకారణం చేత వివాహం కాకపోయినను ఆ కారణం తొలగిపోయి వివాహం నిశ్చయముగా అగును. 

దరిద్రం పోవటానికి

తులసి చెట్టు వద్ద గని సూర్యోదయము కాలమందు సుర్యునుకి ఎదురుగా కుర్చుని తులసి చెట్టుని పూజించి 
నమస్కరించి ఈ తులసి కవచమును ప్రతి రోజు విడవకుండా జపించు వారాలకు దరిద్రం నశించి, దైవభక్తి వృద్ది 
చెంది ఐశ్వర్యవంతులై  సుఖించెదరు. సర్వప్రదములు తొలగిపోవును. అంత్యమందు విష్ణు సాన్నిధ్యము లభించును. 

తులసి కవచం





   ఈ కవచమును ప్రతినిత్యము పాత్ర:కాలమందు పారాయణము చేయువరాలకు ఆరోగ్యము, ఆయుర్దాయము,
   అభివృద్ది చెందును. అకాల మరణములు దరిచేరవు. సంతానవృద్ది,పశువృద్ది, ధనవృద్ది, సర్వజన వస్యము
   లభించును. నిరుద్యోగులకు ఉద్యోగము, ఉద్యోగులకు ఉద్యోగ అభివృద్ది కలుగును. స్త్రిలకు ఈ కవచం పారాయణం
   చేయటం వలన సౌభాగ్యం వృద్ది చెందును.



సర్వగ్రహ శాంతి మంత్రం

                                                    సర్వగ్రహ  శాంతి మంత్రం 

మూల మంత్రము:-   " ఓం హ్రీం సర్వేగ్రహ సోమ సూర్యాం గారక బుధ బృహస్పతి శుశ్రనైశ్చర 
                             రాహు కేతు సహిత మమ సానుగ్రహ భవన్తు ఓం హ్రీం అసి ఆ ఊసా స్వాహ "

పై మంత్రమును 1008 సార్లు జపించిన యెడల సిద్ధించును. తరువాత ప్రతినిత్యము 108 సార్లు చొప్పున జపించుచున్న యెడల సర్వ గ్రహములకు శాంతి కలిగి సాధకునకు పిడను కలుగజేయకుండా గ్రహములన్నియు సుభాములనే  ఇచ్చుచుండును.   

Wednesday, 13 May 2015


రుణ విమోచన అంగారక స్తోత్రం

                                                రుణ విమోచన అంగారక  స్తోత్రం

ఈ కుజ స్తోత్రమును ప్రతి రోజు భక్తీ శ్రధలతో చదువుచున్నచో రుణబాధ,రోగబాధ,అపమృత్యువు,దారిద్రమ,
శత్రుబయము,కుజ గ్రహము వల్ల జాతకరిత్య గాని, గోచరరిత్య గాని, ఏర్పడేడి సమస్త భాదలు భయము, క్లేసము
మనస్తాపము మొదలైన భాదలన్నియు నిస్సoశయముగా తొలిగిపోయీ, దానదన్యములు, సంతానము మొదలైన
లాభములు కలుగును